నీకు అధికారం నిషా తలకెక్కింది: కేజ్రీవాల్ పై అన్నాహజారే మండిపాటు

Anna hazare fires on Arvind kejriwal on liquor policy
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆ రాష్ట్ర సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ పార్టీ కూడా ఇప్పుడు అన్నింట్లో ఒకటిగా మారిపోయిందని.. అధికారం నిషా ఎక్కిందని విమర్శించారు. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎత్తుకున్న ఆదర్శాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ కు ఒక లేఖ రాశారు.

అన్ని పార్టీల్లా మారిపోయింది
‘‘మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా లేఖ రాస్తున్నాను. ఎందుకంటే.. మీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన లిక్కర్ పాలసీ విషయంలో వచ్చిన వార్తలు నన్ను భాధించాయి. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో రాసిన ‘స్వరాజ్’ పుస్తకంలో ఎక్కడైనా స్థానికుల అనుమతి లేకుండా లిక్కర్ దుకాణాలు పెట్టవద్దని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ మర్చిపోయినట్టున్నారు. లిక్కర్ లాగే అధికారం కూడా నిషా ఇస్తుంది. మీకు ఆ అధికారం నిషా తలకు ఎక్కినట్టు కనిపిస్తోంది. మీరు స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మిగతా అన్ని పార్టీల్లాగే మారిపోయింది..” అని హజారే వ్యాఖ్యానించారు.

ప్రజా వ్యతిరేక పాలసీ తెచ్చారు!
‘‘ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ దేశంలో ఎక్కడా కూడా రావాల్సినది కాదు. అలాంటి దానిపై అవగాహన కల్పించాల్సిన విషయాన్ని పక్కన పెట్టేశారు. బలమైన లోక్ పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలను పక్కన పెట్టారు. వీటికి బదులు ప్రజా వ్యతిరేకమైన.. ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తెచ్చారు. ఢిల్లీలో ప్రతి మూలమూలనా మద్యం దుకాణాలను తెరిచారు. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే విష వలయంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి ఎదిగిన పార్టీకి ఇది సరికాదు..” అని అన్నా హజారే పేర్కొన్నారు.
Go Back to Shorts
Anna Hazare
Arvind Kejriwal
AAP
New Delhi
Liquor policy
india

More Telugu News