బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ నోటీసులు
- బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని సమన్ల జారీ
- శుక్రవారం కోల్ కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణ ఉంటుందన్న అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తృణమూల్ నాయకులు
దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కక్షపూరితంగానే అభిషేక్ ను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పార్టీలో రెండవ స్థానంలో ఉన్న తన మేనల్లుడు అభిషేక్ తో పాటు ఇతర సీనియర్ నాయకులకు కేంద్ర ఏజెన్సీలు నోటీసులు పంపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.