తెలంగాణ పోలీస్ నియామక ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు ఉన్నాయంటూ ప్రచారం... స్పందించిన పోలీస్ శాఖ
- ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
- నిన్న ప్రిలిమ్స్ పరీక్ష
- 13 ప్రశ్నల్లో తప్పులు వచ్చాయంటూ ప్రచారం
- వదంతులు నమ్మవద్దన్న పోలీస్ శాఖ
- నిపుణుల కమిటీ క్లారిటీ ఇస్తుందని వెల్లడి
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. సెట్ 'డి'లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి గందరగోళం ఏర్పడినట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తుందని తెలిపారు. అప్పటివరకు పుకార్లను నమ్మవద్దంటూ సూచించారు.