హిట్ మూవీ డైరెక్టర్ తో బెల్లంకొండ శ్రీనివాస్!
- 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బిజీగా బెల్లంకొండ
- వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా
- బెల్లంకొండకి కథ వినిపించిన టీఎన్ సంతోష్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ హీరో
వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి'ని పూర్తిచేసిన తరువాతనే మళ్లీ తెలుగు సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా 'ఛత్రపతి' సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు కావొస్తుండటంతో, ఇక లాభం లేదనుకుని తెలుగు సినిమా కోసం ఒక డైరెక్టర్ కి ఓకే చెప్పినట్టుగా సమాచారం.
బెల్లంకొండతో గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆ దర్శకుడు ఎవరో కాదు .. టీఎన్ సంతోష్. ఇంతకుముందు నిఖిల్ తో ఆయన చేసిన 'అర్జున్ సురవరం' హిట్ అయింది. ఆయన వినిపించిన కథ నచ్చడంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చెప్పాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు.