Ambani: దుబాయ్ లో అత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసిన అంబానీ!

Ambani reportedly bought a luxurious villa in Dubai Palm Jumeirah Island
  • దుబాయ్ లో కృత్రిమంగా నిర్మించిన దీవి పామ్ జుమేరా
  • ఇక్కడి భవంతులను కొనుగోలు చేస్తున్న ప్రముఖులు
  • చిన్న కుమారుడి కోసం ముఖేశ్ అంబానీ భారీ వ్యయం
  • రూ.640 కోట్లతో విల్లా కొనుగోలు
దుబాయ్ ని భూతల స్వర్గంగా పేర్కొంటారు. విలాసానికి, వినోదానికి నెలవుగా దుబాయ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జుమేరా దీవి ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఓ విల్లా కలిగి ఉండడాన్ని ప్రపంచ కుబేరులు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. తాజాగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ కోసం ఇక్కడి పామ్ జుమేరా ఐలాండ్ లో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 

ఈ విల్లాకు ఇరుగుపొరుగు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ అల్ట్రా లగ్జరీ భవంతికి ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విల్లా, మరోవైపు అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ విల్లా ఉన్నాయి. కాగా, ముఖేశ్ అంబానీ కొనుగోలు చేసిన విల్లా ఖరీదు రూ.640 కోట్లు. ఇందులో పది బెడ్రూంలు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, ఒక పర్సనల్ స్పా ఉన్నాయి. 

కాగా, ఈ విల్లాను అనంత్ అంబానీ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు భారీ ఖర్చు చేయనున్నారు. ఈ విల్లా కొనుగోలులో క్రియాశీలక పాత్ర పోషించిన ఓ రియల్ ఎస్టేట్ డీలర్ ఈ వివరాలు తెలిపారు.
Ambani
Villa
Palm Jumeirah
Dubai

More Telugu News