Sourav Ganguly: కోహ్లీ జట్టు కోసమే కాదు, తన కోసం తాను పరుగులు చేయాల్సిన అవసరం ఉంది: గంగూలీ

  • ఫామ్ కోల్పోయిన కోహ్లీ
  • మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న వైనం
  • ఆగస్టు 27 నుంచి ఆసియా కప్
  • ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నామన్న గంగూలీ
Ganguly opines on Kohli

ఫామ్ లో లేక, పరుగులు చేయలేక ఇబ్బందిపడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. కోహ్లీపై విమర్శలు లెక్కకుమిక్కిలిగా వస్తున్నాయి. అదే సమయంలో కోహ్లీకి సలహాలు, సూచనలు ఇచ్చేవారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కోహ్లీ టీమిండియా కోసమే కాకుండా, తన కోసం తాను పరుగులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ లో కోహ్లీ రాణిస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లీ తప్పక పుంజుకుంటాడని ధీమాగా చెప్పారు. 

కోహ్లీ సెంచరీ కోసం అందరం వేచిచూస్తున్నామని, అందుకోసం కోహ్లీ ఎంతగానో శ్రమిస్తున్నాడని గంగూలీ తెలిపారు. టీ20 క్రికెట్ లో సెంచరీ సాధించేందుకు తగినంత సమయం దొరక్కపోవచ్చని, అయితే ఈ సీజన్ లోనే కోహ్లీ సెంచరీ నమోదు చేస్తాడని భావిస్తున్నామని వివరించారు. టీమిండియా ఈ నెల 28న పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా ఆసియా కప్ ప్రస్థానం ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు కోహ్లీపైనే ఉంటాయనడంలో సందేహం లేదు.

More Telugu News