రేపు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ
- ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ
- రేపు తెలంగాణ పర్యటనకు రానున్న జేపీ నడ్డా
- వరంగల్ బీజేపీ సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- ఈ పర్యటనలోనే నితిన్‌తో భేటీ కానున్న నడ్డా
తాజాగా శనివారం తెలంగాణ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్‌కు చెందిన మరో హీరో నితిన్ భేటీ కానున్నట్టు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన మూడో దశ యాత్ర రేపు వరంగల్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరయ్యేందుకే జేపీ నడ్డా తెలంగాణ వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హీరో నితిన్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.