పుకార్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ శంకర్!
- 'ఇండియన్ 2' షూటింగులో శంకర్
- చరణ్ సినిమా ఆగిందంటూ ప్రచారం
- వచ్చేనెల నుంచి మొదలవుతుందన్న శంకర్
- హైదరాబాద్ - వైజాగ్ లలో షూటింగు జరుగుతుందంటూ క్లారిటీ
ఈ నేపథ్యంలోనే 'ఇండియన్ 2' సమస్యలు తొలగిపోవడంతో, శంకర్ ఆ వైపు వెళ్లాడు. ప్రస్తుతం ఆ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. దాంతో చరణ్ ప్రాజెక్టును శంకర్ ఓ మూడు నెలల పాటు పక్కన పెట్టేశాడనీ, ఈ సినిమా విడుదల విషయంలోను ఆలస్యం కానుందనే ప్రచారం జోరందుకుంది.
దాంతో శంకర్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చరణ్ సినిమా .. 'ఇండియన్ 2' ఈ రెండింటిలో దేనినీ పక్కన పెట్టడం జరగదనీ, స్వల్ప విరామాలతో ఒకే సమయంలో రెండు సినిమాలను పూర్తి చేయడం జరుగుతుందని శంకర్ క్లారిటీ ఇచ్చాడు. చరణ్ సినిమా వచ్చేనెల ఫస్టు వీక్ లో హైదరాబాద్ .. వైజాగ్ లలో జరుగుతుందని స్పష్టం చేశాడు.