Gulam Nabi Azad: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పార్టీకి గులాం నబీ అజాద్ రాజీనామా

  • పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా
  • సోనియాకు రాజీనామా లేఖను పంపించిన అజాద్
  • రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని విమర్శ
Gulam Nabi Azad resigns to Congress Party

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. 1970లలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని... అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసమే పని చేశానని తన రాజీనామా లేఖలో తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదని చెప్పారు. 

పార్టీ ఇప్పటికీ రిమోట్ కంట్రోల్ మోడల్ తో పని చేస్తోందని విమర్శించారు. పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతున్నా... సరైన చర్యలు తీసుకోవడం లేదని అజాద్ అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని 2020లో సోనియాగాంధీకి లేఖ రాసిన జీ23 గ్రూపు నేతల్లో అజాద్ కూడా ఒకరు. 

More Telugu News