రఘురామకృష్ణరాజును తలకిందులుగా వేళ్లాడదీసి ఆ రూ.1000 కోట్లు కక్కించండి: సీబీఐని కోరిన విజయసాయి
- ఇటీవల ఏపీ ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడించిన రఘురామ
- రెబెల్ ఎంపీపై విజయసాయి ధ్వజం
- పనీపాటా లేదంటూ విమర్శలు
- మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందని వెల్లడి
ప్రభుత్వ బ్యాంకుల్లో అమాయక డిపాజిటర్లను నిలువునా ముంచాక, ఇప్పుడు రఘురామ మాయలమారి రాజకీయ పండితుడి అవతారం ఎత్తాడని విమర్శించారు. పనీపాటా లేకపోవడంతో అతడి మానసిక ఆరోగ్యం గాడితప్పిందని, అందుకే ఢిల్లీలో కూర్చుని ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రఘురామను తలకిందులుగా వేళ్లాడదీసి ప్రభుత్వ బ్యాంకులకు అతడు బకాయిపడిన రూ.1000 కోట్లను కక్కించాలని సీబీఐని కోరుతున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.