Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ.. అన్నా క్యాంటీన్ ధ్వంసం.. ఉద్రిక్తత!

Hingh tension in Kuppam during Chandrababu visit
  • బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ధ్వంసం 
  • పోటాపోటీగా నిరసనలకు సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ
  • కుప్పంకు చేరుకోవాలంటూ వాట్సాప్ ద్వారా సందేశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో... వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. 

మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
Chandrababu
Telugudesam
Kuppam
YSRCP

More Telugu News