Andhra Pradesh: ఈ నెల 29న జ‌ర‌గాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

ap cabinet meeting on 29th is postponed to september 1st
  • సెప్టెంబ‌ర్ 1కి వాయిదా వేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
  • వాయిదాకు కారణాలు వెల్లడికాని వైనం 
  • ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ప్రభుత్వం
ఏపీ కేబినెట్ భేటీ వాయిదాపడింది. ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ భేటీని ప్రభుత్వం తాజాగా వాయిదా వేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ నెల 29న జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్ర‌భుత్వం... స‌ద‌రు భేటీని సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే, కేబినెట్ భేటీని వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌లేదు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
AP Cabinet

More Telugu News