chop: కర్ణాటకలో సావర్కార్ పోస్టర్లను తాకితే చేతులు నరికేస్తాం: ప్రమోద్ ముతాలిక్ హెచ్చరిక

  • సావర్కార్ ముస్లింలకు వ్యతిరేకి కాదన్న ముతాలిక్
  • బ్రిటిషర్లకు వ్యతిరేకమని వెల్లడి
  • 23 ఏళ్ల పాటు జాతి కోసం పోరాడినట్టు ప్రకటన
Will chop your hands off if you touch Savarkars posters in Karnataka

కర్ణాటకలోని హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. రాష్ట్రంలో ఎక్కడైనా వీర్ సావర్కార్ పోస్టర్లను తొలగిస్తే చేతులు నరికేస్తామంటూ కాంగ్రెస్ నాయకులతో పాటు ఓ మత వర్గానికి చెందిన వారిని హెచ్చరించారు. హిందూ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా వీర్ సావర్కార్ పోస్టర్లు వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ముతాలిక్ ఇలా హెచ్చరించారు. 

శ్రీరామ్ సేన మాతృ సంస్థయే రాష్ట్రీయ హిందూ సేన. దీనికి ప్రమోద్ ముతాలిక్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ‘‘వీర్ సావర్కార్ ముస్లింలకు వ్యతిరేకి కాదు. బ్రిటిషర్లకు మాత్రమే వ్యతిరేకి. ఏవరైనా ముస్లిం లేదా కాంగ్రెస్ కార్యకర్త వీర్ సావర్కార్ ఫొటో లేదా బ్యానర్ ను తొలగించడానికి టచ్ చేస్తే వారి చేతులను నరికేస్తాం. ఇదే మా వార్నింగ్. 23 ఏళ్లపాటు జాతి కోసం పోరాడేందుకు తన జీవితాన్ని ధారపోశారు’’ అని ప్రమోద్ ముతాలిక్ పేర్కొన్నారు. 

గణేశ్ చతుర్ది సందర్భంగా వీర్ సావర్కార్ తో పాటు, బాలగంగాధర్ తిలక్ ఫోటోలు అంటించాలని నిర్ణయించినట్టు హిందూ మహాసభ గౌరీ గణేశ్ సేవా సమితి ప్రెసిడెంట్ రాకేశ్ రామమూర్తి పేర్కొన్నారు. 

More Telugu News