సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 21 లక్షలు నష్టపోయిన మదనపల్లె రిటైర్డ్ టీచర్
- వాట్సాప్ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు
- అదేమిటో తెలియక ఓపెన్ చేసిన బాధితురాలు
- పలు దఫాలుగా రూ. 21 లక్షలు మాయం
- మదనపల్లెకే చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఖాతా నుంచి రూ. 12 లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు
ఖాతాలోంచి డబ్బులు కట్ అయిన ప్రతిసారీ మొబైల్‌కు మెసేజ్‌లు వస్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఖాతా హ్యాక్ అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పడంతో వరలక్ష్మి నిన్న సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబరు 1930కి ఫిర్యాదు చేశారు. కాగా, మదనపల్లెకే చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జ్ఞానప్రకాశ్ ఖాతా నుంచి ఇలాగే రూ. 12 లక్షలు మాయమయ్యాయి.