తాత అయిన అనిల్ కపూర్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

Sonam Kapoor gives birth to baby boy
  • 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్ కపూర్
  • రెండేళ్ల డేటింగ్ అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి
  • బిడ్డ రాకతో తమ జీవితాలు ఎంతో మారుతాయన్న సోనమ్
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తాత అయ్యారు. ఆయన కుమార్తె, సినీ నటి సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈరోజు మగ బిడ్డ తమ మధ్యకు వచ్చాడని... బిడ్డకు స్వాగతం పలుకుతున్నామని తెలిపింది. ఈ క్రమంలో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలియజేసింది. తమకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని.. తమ జీవితాలు ఎంతో మారుతాయని చెప్పింది. 

ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజాతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో ఆయనను సోనమ్ పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి బాలీవుడ్ స్టార్లు తరలివచ్చారు. లండన్ లో ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా సోనమ్ కు ఆనంద్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు.
Go Back to Shorts
Sonam Kapoor
Anand Ahuza
Baby Boy
Anil Kapoor
Bollywood

More Telugu News