'గాడ్ ఫాదర్' టీజర్ రెడీ .. రేపు సాయంత్రం రిలీజ్!
- 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి
- ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ ఖాన్
- కీలకమైన పాత్రను పోషించిన నయన్
- సంగీతాన్ని అందించిన తమన్
- అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితమే అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు.
ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ కనిపించనుండగా, కీలకమైన పాత్రను నయనతార పోషించింది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టయినర్ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సారి దసరాకి థియేటర్స్ దగ్గర సందడి ఒక రేంజ్ లో ఉండేట్టుగానే కనిపిస్తోంది మరి.