బీహార్ సీఎం నితీశ్ ను విదేశీ మహిళతో పోల్చుతూ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- విదేశాల్లో మహిళలు కోరుకున్నప్పుడు బోయ్ ఫ్రెండ్స్ ను మారుస్తారన్న విజయ వర్గీయ
- బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అంతేనని వ్యాఖ్య
- ఆయన ఎప్పుడు ఎవరి చేయి పట్టుకుంటారో, వదిలేస్తారో తెలియదంటూ కామెంట్
బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై మీడియా ముఖంగా విజయవర్గీయ మాట్లాడారు. ‘‘నేను విదేశాల్లో కొన్ని రోజుల పాటు ఉన్నప్పుడు.. ఇక్కడ మహిళలు తమ బోయ్ ఫ్రెండ్స్ ను ఎప్పుడైనా మార్చుకుంటారని ఒకరు నాతో చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా అంతే. ఆయన ఎవరి చేయి పట్టుకుంటారో, ఎవరిని వదిలేస్తారో మనకు ఎప్పటికీ అర్థం కాదు’’ అని విజయవర్గీయ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ.. మహిళల పట్ల వారికున్న గౌరవానికి ఇది నిదర్శనమంటూ ట్విట్టర్లో విమర్శించారు.