Vijayashanti: సొంత పార్టీ నేతలపై విజయశాంతి అసహనం

Vijayashanti dissatisfaction on BJP leaders
  • పార్టీ నాయకత్వం తన సేవలను వినియోగించుకోవడం లేదన్న విజయశాంతి 
  • పార్టీలో మాట్లాడటానికి తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ 
  • తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని వ్యాఖ్య 
సొంత పార్టీ నేతలపై సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం తన సేవలను ఉపయోగించుకోవడం లేదని... తనను నిశ్శబ్దంలో ఉంచుతున్నారని అన్నారు. పార్టీలో మాట్లాడటానికి తనకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని చెప్పారు. 

ఈరోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడదామని అనుకున్నామని... లక్ష్మణ్ వచ్చి మాట్లాడి వెళ్లిపోయారని... తనకు ఏమీ అర్థం కాలేదని అన్నారు. తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని అన్నారు.
Vijayashanti
BJP
Bandi Sanjay

More Telugu News