జింబాబ్వేను 189 పరుగులకు పరిమితం చేసిన టీమిండియా
- హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- తడబడిన జింబాబ్వే టాపార్డర్
- తలో మూడు వికెట్లు తీసిన చహర్, ప్రసిద్ధ్, అక్షర్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ రెజిస్ చకబ్వా 35, రిచర్డ్ ఎన్గరవా 34, బ్రాడ్ ఇవాన్స్ 33 పరుగులతో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు పట్టు విడవకుండా ఒత్తిడి పెంచారు. దాంతో ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి ఓవర్లన్నీ పూర్తికాకుండానే ఆలౌటైంది. సిరాజ్ ఓ వికెట్ తీశాడు.