బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం.. నితిన్ గడ్కరీ, చౌహాన్ లకు షాక్

BJP new parliamentary board
  • 11 మందితో పార్లమెంటరీ బోర్డు నియామకం
  • బోర్డులో నడ్డా, మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ తదితరులు
  • యడియూరప్పకు బోర్డులో చోటు
పార్టీ అత్యున్నత బాడీ అయిన పార్లమెంటరీ బోర్డును బీజేపీ నియమించింది. ఈ నూతన బోర్డు నియామకంలో పార్టీలో సీనియర్లు అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు అధిష్ఠానం షాకిచ్చింది. వీరిద్దరినీ బోర్డు నుంచి తప్పించింది. వీరిద్దరినీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా తొలగించడం గమనార్హం. ఇదే సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, సుధా యాదవ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, శర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, సత్యనారాయణ జాటియాలను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంది.  

బీజేపీ నూతన పార్లమెంటరీ బోర్డు సభ్యులు వీరే:

  • జేపీ నడ్డా
  • నరేంద్ర మోదీ
  • రాజ్ నాథ్ సింగ్
  • అమిత్ షా
  • యడియూరప్ప
  • శర్బానంద సోనోవాల్
  • కే లక్ష్మణ్
  • ఇక్బాల్ సింగ్ లాల్ పురా
  • సుధా యాదవ్
  • సత్యనారాయణ జాటియా
  • బీఎల్ సంతోష్

Go Back to Shorts
BJP
Parliamentary Bord
Nitin Gadkari

More Telugu News