ప్రముఖ ఫుట్​బాల్ క్లబ్​పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు మస్క్

 Elon Musk now sets eye on Manchester United
  • మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ ను కొంటానని ట్వీట్
  • గతంలో ట్విట్టర్ కొనుగోలు డీల్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న ఎలాన్
  • మస్క్ పై న్యాయ పోరాటం చేస్తున్న ట్విట్టర్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేయాలన్న డీల్ నుంచి అర్థాంతరంగా వైదొలిగి న్యాయ పోరాటంలో చిక్కుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇంగ్లిష్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టుపై కన్నేశారు. ఈ ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ ను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘నిజం చెప్పాలంటే నేను రిపబ్లికన్ పార్టీ ఎడమ భాగాన్ని, డెమోక్రాటిక్ పార్టీ కుడి భాగాన్ని సపోర్ట్ చేస్తా’ అని ట్వీట్ చేసిన ఎలాన్ ఆ వెంటనే ‘నేను మాంచెస్టర్ యూనైటెడ్ ను కూడా కొంటున్నా. మీ అందరికీ స్వాగతం’ అని మరో ట్వీట్ చేశారు.

అయితే, ఇలాంటి ట్వీట్ల విషయంలో మస్క్ వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ వార్త ఫుట్ బాల్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన గ్లేజర్ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న మాంచెస్టర్ క్లబ్ కొన్నేళ్లుగా నిరాశ పరుస్తోంది. దాంతో, క్లబ్ బాధ్యతలు గ్లేజర్ నుంచి మరొకరు తీసుకోవాలని మాంచెస్టర్ అభిమానులు కోరుకుంటున్నారు. క్లబ్ ను మస్క్ కొనుగోలు చేయాలని కొందరు భావిస్తున్నారు. 

అయితే, ట్విట్టర్ కొనుగోలు నిర్ణయం నుంచి అర్థాంతరంగా తప్పుకున్న నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాంచెస్టర్ క్లబ్ విషయంలో కూడా అదే చేస్తారని, అందుకే మస్క్ ట్వీట్లను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. 
Go Back to Shorts
elon musk
twitter
deal
Manchester United
football
club

More Telugu News