'కార్తికేయ 2'కి కలిసొచ్చింది అదే!
- ఈ నెల 13న విడుదలైన 'కార్తికేయ 2'
- తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న థియేటర్లు
- ఓవర్సీస్ లో పుంజుకున్న వసూళ్లు
- ఈ వారంలోను ఈ సినిమాదే హవా
అయితే ఈ సినిమాకంటే ఒకరోజు ముందుగా విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా మెప్పించలేకపోయింది. ఆడియన్స్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోవడం .. దగ్గరలో పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇప్పుడు ఎక్కువ థియేటర్లు దొరుకుతూ ఉండగా .. ఓవర్సీస్ లో వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ సినిమా 3 రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టిందని అంటున్నారు. ఈ వారంలో చెప్పుకోదగిన సినిమాలేవీ బరిలోకి దిగడం లేదు కాబట్టి, ఈ సినిమా భారీ లాభాలను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.