త్వరలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్: షార్ డైరెక్టర్ రాజరాజన్
- ఇటీవల ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం
- సెన్సర్ సమస్యే కారణమని రాజరాజన్ వెల్లడి
- గగన్ యాన్ లో తొలుత మానవరహిత ప్రయోగాలు
- ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందని వివరణ
ఇక, సెప్టెంబరు, అక్టోబరులో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్ ప్రయోగం చేపట్టబోతున్నామని వెల్లడించారు. గగన్ యాన్ లో తొలుత మానవరహిత ప్రయోగాలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందని రాజరాజన్ వివరించారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా 4 ప్రధాన గ్రౌండ్ టెస్టులు జరపాల్సి ఉందని అన్నారు.
2023 ఫిబ్రవరి-జులై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు. 4 నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోందని తెలిపారు.