నేను ఎంపీగా ఉన్నా, లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదు: కేశినేని నాని

I am happy in TDP say Kesineni Nani
  • టీడీపీలో తాను తృప్తిగానే ఉన్నానన్న నాని 
  • గోరంట్ల మాధవ్ వీడియో ప్రైవేట్ అంశం కాదని వ్యాఖ్య 
  • రాజకీయ నేతలు క్లీన్ గా ఉండాలని సలహా 
టీడీపీలో కేశినేని నాని వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కేశినేని నాని మాట్లాడుతూ... తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని అన్నారు. తాను ఎంపీగా ఉన్నా... లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదని.... తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని చెప్పారు. తన ఎంపీ స్టిక్కర్ కేవలం తన కారుపై మాత్రమే ఉంటుందని... ఆ కారులో తన కూతురును కూడా తిరగనివ్వనని కేశినేని నాని తెలిపారు. 

ఇక వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని... అది మహిళలకు సంబంధించిన విషయమని చెప్పారు. రాజకీయ నాయకులు చాలా క్లీన్ గా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు మన దేశ పరిస్థితి చాలా దారుణంగా వుండేదని... ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. విజయవాడలోని కేశినేని భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను నాని ఎగురవేశారు.  
Go Back to Shorts
Kesineni Nani
Telugudesam

More Telugu News