Tejashwi Yadav: తన ప్రేమ, పెళ్లిపై తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారో వివరించిన తేజస్వి యాదవ్

  • బీహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్
  • ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాల ప్రస్తావన
  • రాచెల్ తో డేటింగ్ విషయం తండ్రికి చెప్పానని వివరణ
  • ఆయన అభ్యంతరం చెప్పలేదని వెల్లడి
Tejaswi Yadav reveals what his father told when he said about his love

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలు వెల్లడించారు. తన పెళ్లికి ముందు తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ తో జరిగిన సంభాషణను వివరించారు. తాను రాచెల్ గొడిన్హోను ప్రేమించానని, అదే విషయాన్ని తండ్రికి చెప్పినట్టు వెల్లడించారు. 

"ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాను. ఈమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మా నాన్నతో చెప్పాను. అయితే ఆ అమ్మాయి క్రిస్టియన్. అయినా మా నాన్న ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఓకే, నో ప్రాబ్లమ్ అన్నట్టుగా ఆయన ఆమోదం తెలిపారు" అంటూ తేజస్వి తెలిపారు. 

తేజస్వి జీవితంలోకి అడుగుపెట్టిన రాచెల్ గొడిన్హో హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన యువతి. ఆమె క్రైస్తవ వర్గానికి చెందినది. తేజస్వి, రాచెల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్స్. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమాయణం నడిచింది. రాచెల్ తండ్రి ఓ స్కూల్ రిటైర్డ్  ప్రిన్సిపాల్. రాచెల్ గొడిన్హో పౌర విమానయాన రంగంలో ఉద్యోగిని. గత డిసెంబరులోనే తేజస్వి, రాచెల్ వివాహం జరిగింది. 

పెళ్లి నేపథ్యంలో రాచెల్ హిందుత్వం స్వీకరించిందని, తన పేరు రాజ్ శ్రీ లేక రాజేశ్వరిగా మార్చుకుందని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లాలు, రబ్రీదేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం కాగా వారిలో తేజస్వి అందరికంటే చిన్నవాడు. తేజస్వికి ఒక అన్న తేజ్ ప్రతాప్, ఏడుగురు అక్కలు ఉన్నారు. తేజస్వినే లాలు రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందారు.

More Telugu News