అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు
- పది నెలల్లోనే లక్ష వాహనాల తయారీ
- ఎస్ యూవీ విక్రయాల్లో సరికొత్త రికార్డు
- ఒక్క జులై నెలలోనే 11,007 యూనిట్ల అమ్మకాలు
అంతర్జాతీయ క్రాష్ టెస్ట్ లో ఐదు స్టార్లు సంపాదించిన పంచ్ వాహనానికి మంచి డిమాండ్ వస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. అంటే వాహనానికి, వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎక్కువ భద్రత ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. 2021 అక్టోబర్ లో టాటా మోటార్స్ పంచ్ ను విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా విక్రయమవుతున్న టాప్ 10 కార్లలో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది ఒక్క జులైలోనే 11,007 యూనిట్లు అమ్ముడుపోయాయి.