మహారాష్ట్ర వ్యాపారి ఇంట్లో పట్టుబడ్డ రూ. 58 కోట్ల నోట్ల కట్టలు, 32 కిలోల బంగారం
- ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో దాడులు చేసిన ఐటీ అధికారులు
- పలు ప్రాంతాల్లో ఐదు బృందాలుగా తొమ్మిది రోజుల పాటు సోదాలు
- నగదు లెక్కించడానికే 13 గంటల సమయం
ఆదాయపు పన్ను శాఖ నాసిక్ విభాగం ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జల్నా, ఔరంగాబాద్ నగరాల్లోని సదరు వ్యాపారి కార్యాలయాలు, నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ డిపార్ట్మెంట్ కు 13 గంటల సమయం పట్టింది. మొత్తం 260 మంది అధికారులు, ఉద్యోగులు ఐదు బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు.