టైరు పేలడంతో బోల్తాపడిన కారు.. ఇద్దరు చిన్నారుల సహా నలుగురి దుర్మరణం

Road accident in nizamabad dist 4 belongs to tolichowki dead
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు బోల్తాపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బైపాస్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండగా, గాయపడిన వారిలోనూ మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులను హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన వారిగా గుర్తించి సమాచారం అందించారు.
Go Back to Shorts
Hyderabad
Nizamabad District
Tolichowki

More Telugu News