రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు

Chandrababu met President of India Droupadi Murmu
  • ఢిల్లీలో చంద్రబాబు పర్యటన
  • ముర్ము నివాసంలో టీడీపీ నేతల సందడి
  • రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఆమె అందరికీ స్ఫూర్తిప్రదాత అని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన ముర్ము నివాసానికి తరలివెళ్లారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలపై ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు నూతన రాష్ట్రపతితో ఫొటో దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. వినయం, కరుణల ప్రతిరూపం ద్రౌపది ముర్ము అని కొనియాడారు. ఆమె అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కీర్తించారు. 

అంతకుముందు చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లకాలంలో వీరిద్దరూ కలిసింది లేదు. ఈ నేపథ్యంలో, ఐదు నిమిషాల పాటు చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య ఏకాంత సమావేశం జరిగింది. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది బయటికి తెలియరాలేదు.
Go Back to Shorts
Chandrababu
Droupadi Murmu
New Delhi
TDP

More Telugu News