కామన్వెల్త్ క్రీడల క్రికెట్: టీమిండియా స్కోరు 164/5... లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మహిళల దూకుడు

Team India women set England 165 runs target in Commonwealth Games semifinal
బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల క్రికెట్ సెమీస్ లో టీమిండియా మహిళలు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన చెలరేగి ఆడుతూ 32 బంతుల్లోనే 61 పరుగులు చేసింది. స్మృతి 8 ఫోర్లు, 3 సిక్సులు బాదింది. 

అనంతరం జెమీమా రోడ్రిగ్స్ 44, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ 2, కాథరిన్ బ్రంట్ 1, కెప్టెన్ నటాలీ సివర్ 1 వికెట్ తీశారు. 

లక్ష్యఛేదనను ఇంగ్లండ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లలోనే 24 పరుగులు చేసింది. అయితే, మూడో ఓవర్లో ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఓపెనర్ సోఫీ డన్ క్లేను దీప్తి శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. డన్ క్లే 10 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 42 పరుగులు. క్రీజులో ఓపెనర్ డానియెల్లే వ్యాట్ (20 బ్యాటింగ్), అలిస్ కాప్సే ఉన్నారు.
Go Back to Shorts
Team India
Women
England
Semifinal
Commonwealth Games

More Telugu News