TSPSC: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

TSPSC invites applications for DAO posts
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో మరో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని ఈ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

ముఖ్యాంశాలు...

  • అప్లికేషన్ విండో ఆగస్టు 17న తెరుచుకోనుంది. 
  • దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 6.
  • ఉద్యోగార్థులు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారై ఉండాలి.
  • రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి సడలింపు ఉంటుంది.
  • దేశంలోని గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమానమైన అర్హతలను కలిగి ఉండాలి.
  • దరఖాస్తు రుసుం కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు రూ.120. అయితే, నిరుద్యోగ అభ్యర్థులు ఈ పరీక్ష ఫీజు చెల్లించనవసరంలేదు. 
  • అభ్యర్థులకు సీబీఆర్టీ/ఓఎంఆర్ విధానంలో పరీక్ష (ఆబ్జెక్టివ్ టైపు) ఉంటుంది.
  • 2022 డిసెంబరులో రాతపరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.
  • రాత పరీక్షలో మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 
  • అయితే ఈ పరీక్షను కంప్యూటర్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకునే అధికారం టీఎస్ పీఎస్ సీకి ఉంటుంది.
  • ఓసీ, క్రీడా కోటా (పురుషులు), ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 40 శాతం మార్కులను అర్హత శాతంగా నిర్ణయించారు. బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

Go Back to Shorts
TSPSC
DAO
Posts
Notification
Telangana

More Telugu News