ఆగస్ట్ 15న ఓలా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ
- కొత్త ఉత్పత్తిపై ప్రకటన పట్ల ఉత్సాహంగా ఉందన్న సీఈవో భవీష్ అగర్వాల్
- భవిష్యత్తు భారీ ప్రణాళికలను కూడా పంచుకుంటామని ట్వీట్
- సరిగ్గా ఏడాది తర్వాత మార్కెట్లోకి మరో ఉత్పత్తి
‘‘ఆగస్ట్ 15న నూతన ఉత్పత్తి గురించి ప్రకటిస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తుకు సంబంధించి భారీ ప్రణాళికలను సైతం అదే రోజు పంచుకుంటాం’’ అని భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న కొత్త ఉత్పత్తిని ఆవిష్కరిస్తామని చెప్పడమే కానీ, అది కారా? లేక మరో టూవీలరా? అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకం కింద బ్యాటరీల తయారీపై ప్రోత్సాహకాలకు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఎంపికైంది.