IndiGo: ఇండిగో విమానాల నుంచి ఇకమీదట ప్రయాణికులు వేగంగా దిగిపోవచ్చు

  • రెండు ర్యాంపుల స్థానంలో మూడు వినియోగం
  • ముందు రెండు, వెనుక భాగంలో ఒక  ద్వారం
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం
  • త్వరలో అన్ని ప్రాంతాలకూ విస్తరణ
IndiGo introduces process for faster de boarding of passengers

పరిశ్రమలోనే తొలిసారిగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రయాణికులు గమ్య స్థానంలో విమానం నుంచి వేగంగా దిగిపోయేందుకు మూడో డోర్ మార్గాన్ని వినియోగించుకోనుంది. దీంతో గతంతో పోలిస్తే ప్రయాణికులు 6-7 నిమిషాలు ముందే విమానం దిగేసి వెళ్లిపోగలరు. ఈ మేరకు వారికి సమయం ఆదా అవుతుంది. 

సాధారణంగా విమానాల్లో రెండు ర్యాంపులే ఉంటాయి. ఇండిగో మూడు ర్యాంపులను వినియోగించుకోనుంది. విమానం ముందు భాగంలో రెండు వైపులా రెండు మార్గాలు ఉంటాయి. వెనుక భాగంలో మరో ద్వారం ఉంటుంది. ఈ విధానాన్ని వినియోగించే మొదటి ఎయిర్ లైన్ గా ఇండిగో రికార్డు సృష్టించింది. 

‘‘ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఈ విధానాన్ని ఆరంభించాం. వచ్చే 90 రోజుల్లో అన్ని విమానాలకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తాం’’ అని ఇండిగో సంస్థ ప్రకటించింది. ఏ320 విమానం నుంచి ప్రయాణికులు అందరూ దిగిపోవడానికి 13-14 నిమిషాలు పట్టేది. కొత్త విధానంలో ఈ సమయం 7 నిమిషాలకు తగ్గిపోతుంది.

More Telugu News