ఇండిగో నుంచి ‘స్వీట్ 16’ ఆఫర్.. రూ. 1616కే టికెట్
- సంస్థను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆఫర్
- ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ప్రయాణించే వీలు
- రేపటి వరకే ఆఫర్
ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ గురించి ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తోందన్నారు. అయితే, ఈ ఆఫర్లో భాగంగా ఎన్ని టికెట్లను విక్రయించేది వెల్లడించలేదు.