కారు ఢీకొనడంతో ఎగిరి రోడ్డుపై పడిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. అలాగే ముందుకెళ్లిన బస్సు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన
- ప్రయాణికులతో కావలి నుంచి నెల్లూరు వెళ్తున్న బస్సు
- కండక్టర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
వెంటనే అప్రమత్తమైన కండక్టర్ నాగరాజు స్టీరింగ్ వద్దకు వచ్చి బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగేదే. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ఢీకొన్న కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కారును విశాఖపట్టణానికి చెందిన విజయ్‌పంత్ అనే డాక్టర్‌కు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.