Xiaomi: షావోమీ నుంచి ఎయిర్ ఫ్రయర్

  • త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం
  • యాప్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు
  • యాప్ లో100కుపైగా రెసిపీల సమాచారం
  • ఓవెన్ గానూ పనిచేస్తుంది
Xiaomi Air Fryer to launch soon in India company hints with its food tweet

చైనాకు చెందిన షావోమీ కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో ఎయిర్ ఫ్రయర్ ను విడుదల చేసే సన్నాహాలతో ఉంది. ఎంఐ స్మార్ట్ ఎయిర్ ఫ్రయర్ పేరిట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఉత్పత్తిగా దీన్ని తీసుకురానుంది. ట్విట్టర్ లో షావోమీ టీజర్లను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తోంది. ఇప్పటికే చైనా, యూరోప్ మార్కెట్లలో దీన్ని విడుదల చేసింది.

షావోమీ గ్లోబల్ వెబ్ సైట్ లోని సమాచారం ప్రకారం.. స్మార్ట్ ఎయిర్ ఫ్రయర్ 3.5 లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. ఎంఐ హోమ్ యాప్ సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్ నుంచే ఎయిర్ ఫ్రయర్ ను ఆపరేట్ చేయవచ్చు. ఈ యాప్ లో 100కు పైగా వివిధ రకాల వంటల (రెసిపీలు) సమాచారం ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా కు సైతం ఎయిర్ ఫ్రయర్ సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్ తోనూ దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు.

దీనికి ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. 40 నుంచి 200 డిగ్రీల మధ్య టెంపరేచర్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫ్రయర్ బాస్కెట్ ను ఏ సమయంలో అయినా తెరిచి, లోపల పెట్టినవి ఏమేరకు ఉడికాయో కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఓవెన్ గా, ఫ్రూట్ డ్రయర్ గా, పెరుగు తయారు చేసే మెషిన్ గానూ వాడుకోవచ్చు. యూరోప్ లో అయితే దీన్ని రూ.7,945 కు షావోమీ విక్రయిస్తోంది.

More Telugu News