టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి డబ్బు దోచుకున్న దుండగులు
- జులై 31న చోటుచేసుకున్న ఘటన
- కారులోకి ఎక్కి కత్తితో బెదిరించిన దుండగులు
- రూ. 75 వేలు దోచుకున్న వైనం
ఈ ఘటన జులై 31న చోటు చేసుకోగా... నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా? ఆయన వాహనాన్ని ఎవరైనా అనుసరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.