Telangana: ఢిల్లీలో డీకే అరుణ‌, ఈట‌ల రాజేంద‌ర్‌... రేపు అమిత్ షా, జేపీ న‌డ్డాలతో కీల‌క భేటీ

bjp telangana leaders etela rejender and dk aruna will meet amit shah and jp nadda tomorrow in delhi
  • కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో భేటీ
  • తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చ‌ర్చలు
  • పార్టీలో చేరిక‌ల‌పై అమిత్ షా, న‌డ్డాల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న తెలంగాణ నేత‌లు

బీజేపీకి చెందిన తెలంగాణ కీల‌క నేత‌లు డీకే అరుణ‌, ఈట‌ల రాజేంద‌ర్‌లు సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఇద్ద‌రు నేత‌లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప‌లు కీల‌క అంశాల‌పై వారు మంత్రితో చ‌ర్చించారు. 

ఈ క్రమంలో రేపు (మంగ‌ళ‌వారం) ఈట‌ల రాజేంద‌ర్‌, డీకే అరుణ‌లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌తో భేటీ కానున్నారు. తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు బీజేపీలో చేరే విష‌యంపై ఈ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News