Team India: టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ మరో గంట ఆలస్యం!

Another hour of delay to the start of Team India and West Indies match
  • మార్గమధ్యంలోనే ఉన్న ఆటగాళ్ల లగేజీ, కిట్లు
  • ఇంకా స్టేడియానికి చేరుకోని ఆటగాళ్ల సరంజామా
  • ఇప్పటికే రెండు గంటలు ఆలస్యం
  • మ్యాచ్ 11 గంటలకు ప్రారంభం అవుతుందని తాజా ప్రకటన
ఆటగాళ్ల లగేజీ, కిట్లు సకాలంలో అందకపోవడంతో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యం కావడం తెలిసిందే. అయితే, ఇంకా కిట్లు స్టేడియానికి చేరుకోకపోవడంతో మ్యాచ్ ను మరో గంట వాయిదా వేశారు. తాజా నిర్ణయం ప్రకారం మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ కు ఇంకా టాస్ కూడా వేయలేదు. 

ఈ ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా జులై 29న తొలి టీ20 జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ కు వేదికైన ట్రినిడాడ్ లోని తరౌబా నుంచి ఆటగాళ్ల లగేజి రెండో మ్యాచ్ కు వేదికైన బాసెటెర్రీ (సెయింట్ కిట్స్)కి రవాణా చేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ కారణంగా రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది.
Team India
West Indies
Match
Delay
Kits
Luggage
2nd T20
Basseterre
St Kitts

More Telugu News