vikrant rona: నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో ‘విక్రాంత్ రోణ’

Vikrant Rona Film estimated to cross 115 worldwide
  • కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం సూపర్ హిట్
  • జులై 28న ఐదు భాషల్లో విడుదలైన సినిమా
  • ఆదివారం ఒక్క రోజే రూ. 29 కోట్ల కలెక్షన్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆదివారం నాడు రూ.29 కోట్లు వసూలయ్యాయి. దాంతో, తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టనున్నట్టు సమాచారం.

రణ్ బీర్ కపూర్ ‘షంషేరా’ మొదటి వారంలో రూ. 40 కోట్లు మాత్రమే సాధించగా.. ‘విక్రాంత్ రోణ’ అంతకు మూడింతలు వసూళ్లు రాబట్టడం విశేషం. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ సహా ఐదు భాషల్లో జులై 28న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. రూ. 95 కోట్ల బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించారు. కన్నడలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుదీప్ తో పాటు నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన ‘విక్రాంత్ రోణ’ను జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ నిర్మించారు.
vikrant rona
movie
kiccha sudeep
collections
box office

More Telugu News