Reliance Jio: జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో ఉచితంగా నెట్ ఫ్లిక్స్ 

Reliance Jio postpaid plans offering free subscription to Netflix Amazon Prime and others
  • అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఉచితమే
  • డేటా వినియోగం ఆధారంగా వివిధ ప్లాన్లు
  • రూ.399 - 1,499 మధ్య నెలవారీ టారిఫ్ లు
రిలయన్స్ జియో ఆకర్షణీయమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. వీటితోపాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర సేవలను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్లతో పోలిస్తే పోస్ట్ పెయిడ్ ప్లాన్ల చార్జీ ఎక్కువే ఉంది. కాకపోతే వీటితో వచ్చే ఉచిత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఆకర్షణీయంగానే ఉన్నాయి.

పోస్ట్ పెయిడ్ లో ఆరంభ ప్లాన్ రూ.399. దీనితో నెట్ ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించొచ్చు. నెలకు 75 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. అంటే రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే పరిమితి లేకుండా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. కేవలం నెట్ ఫ్లిక్స్ వరకే కాకుండా అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ సేవలు కూడా ఈ ప్లాన్ తో ఉచితంగా లభిస్తాయి. 

రూ.599 ప్లాన్ లో నెలవారీగా 100జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. కాల్స్ ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ ల వరకు ఉచితం. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ కూడా ఉచితమే. 

రూ.799 ప్లాన్ లో 150జీబీ ఉచిత డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ గా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ల విషయంలోనూ పరిమితి లేదు. వినియోగించుకోకుండా మిగిలి ఉంటే 200 జీబీ వరకు రోలోవర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లోనూ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితం. ఇక మరింత డేటా కోరుకునే వారి కోసం రూ.999, రూ.1,499 ప్లాన్లు కూడా ఉన్నాయి.
Reliance Jio
postpaid plans
free benefits
netflix
amazon prime

More Telugu News