Narendra Modi: ఆగస్టు 2 నుంచి 15 దాకా జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

From August 2 to 15 put the national flag as a profile pic PM Modi call to people
  • జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య జయంతి అయిన ఆగస్టు 2 నుంచి ప్రారంభించాలని సూచన
  • 75 ఏళ్ల స్వాతంత్ర్య చారిత్రక ఘట్టానికి మనందరం సాక్షులన్న మోదీ
  • దేశవ్యాప్తంగా ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని విజ్ఞప్తి
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.

పింగళి వెంకయ్య జ్ఞాపకంగా..
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి రోజైన ఆగస్టు 2వ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ వరకు.. ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ‘‘భారత దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి మనందరం సాక్షులు కాబోతున్నాం.” అని పేర్కొన్నారు.
  • కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల నివాసాలపై జాతీయ జెండాను ఎగరవేయనున్నట్టు అంచనా.
  • ఈ కార్యక్రమం కోసమని జాతీయ జెండాల తయారీకి సంబంధించిన కోడ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీ వస్త్రాలన్నింటినీ జాతీయ జెండా తయారీకి వినియోగించవచ్చని పేర్కొంది.
  • జెండా పరిమాణంపైగానీ, ఎగరవేసే సమయంపైగానీ ఉన్న ఆంక్షలను కొద్దిరోజుల పాటు సడలిస్తున్నట్టు ప్రకటించింది.
Narendra Modi
BJP
Flag
India
Indian Flag
August 15
Indipencence Day
Social Media
National

More Telugu News