ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య... ఫొటో ఇదిగో
- హైదరాబాద్ పర్యటనలో వెంకయ్య
- మేక్ఇన్ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన క్వాంటమ్ ఎనర్జీ
- స్కూటర్లను పరిశీలించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి
క్వాంటమ్ ఎనర్జీ అనే సంస్థ కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయగా... వాటిని వెంకయ్య పరిశీలించారు. క్వాంటమ్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన ఈ స్కూటర్ల వల్ల క్లీనర్, గ్రీనర్ ఇండియా దిశగా మరో ముందడుగు పడిందని ఆయన చెప్పారు.