India: దేశంలో మంకీ పాక్స్ సోకిన తొలి వ్యక్తికి నెగిటివ్.. డిశ్చార్జి చేస్తున్నామన్న కేరళ ఆరోగ్య శాఖ

Indias first monkeypox patient completely cured
  • పుండ్లు సహా మంకీ పాక్స్ లక్షణాలన్నీ తగ్గిపోయాయని వెల్లడి
  • అన్ని శాంపిల్స్ రెండు సార్లు పరీక్షించినా నెగిటివ్ వచ్చిందని ప్రకటన
  • మిగతా ఇద్దరు బాధితులు కూడా కోలుకుంటున్నారన్న కేరళ మంత్రి 
దేశంలో మంకీ పాక్స్ వైరస్ సోకిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నారు. చికిత్స అనంతరం ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారని.. శరీరంపై దద్దుర్లు/పుండ్లు పూర్తిగా తగ్గిపోయాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. సదరు పేషెంట్ నుంచి సేకరించిన అన్ని శాంపిళ్లను రెండు సార్లు పరీక్షించగా.. మంకీ పాక్స్ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. సదరు వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉన్నారని.. శనివారమే డిశ్చార్జి చేస్తున్నామని ప్రకటించారు.

తొలి కేసుతో సంచలనం
కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి జులై 14న దేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఆయనను తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐసోలేషన్ ఉంచి చికిత్స అందించారు. తాజాగా మంకీ పాక్స్ లక్షణాలన్నీ తగ్గిపోవడంతో.. గత మూడు రోజుల్లో రెండు సార్లు శాంపిల్స్ ను పరీక్షించగా.. నెగిటివ్ వచ్చింది.

ఇక కేరళలోనే మంకీ పాక్స్ పాటిజివ్ గా ఉన్న మరో ఇద్దరికీ చికిత్స కొనసాగుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఆ ఇద్దరూ కూడా కోలుకుంటున్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు.
India
Monkeypox Virus
Cure
Kerala
Veena Gorge
Health

More Telugu News