టీవీ చూస్తూ ఎలుకల మందు కలిపిన టమాటాలను నూడిల్స్ లో వేసిన మహిళ... చికిత్స పొందుతూ మృతి

Woman died after eating noodles made with rat poison laced tomatoes
  • ప్రాణం తీసిన పొరపాటు
  • ఎలుకల కోసం టమాట్లో మందును కలిపిన మహిళ
  • చూసుకోకుండా ఆ టమాటాలతో నూడిల్స్ వంటకం
  • తిన్న గంట తర్వాత వాంతులు
ముంబయిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ల మహిళ పొరబాటున నూడిల్స్ లో ఎలుకల మందు కలిపిన టమాటాలు వేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. రేఖా నిషాద్ అనే మహిళ ముంబయిలోని మలాద్ ప్రాంతంలో పాస్కల్ వాడిలో నివసిస్తోంది. ఆమె తన ఇంట్లో టీవీ చూస్తూ నూడిల్స్ తయారుచేస్తోంది. నూడిల్స్ లో టమాటాలు వేయాలని భావించింది.

అయితే ఎలుకలను చంపేందుకు ఎరకోసం కొన్ని టమాటాల్లో ఎలుకల మందు కలిపింది. టీవీ చూస్తూ పొరబాటున మామూలు టమాటాలకు బదులు, ఎలుకల మందు కలిపిన టమాటాలను నూడిల్స్ లో వేసేసింది. దాంతో ఆ నూడిల్స్ విషపూరితంగా మారాయి. ఈ విషయం తెలియని రేఖా నిషాద్ ఆ నూడిల్స్ ను తిన్న కాసేపటికే అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంటుండడంతో భర్త, మరిది ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది.
Go Back to Shorts
Rekha Nishad
Death
Noodles
Tomatoes
Rat Poison
Mumbai

More Telugu News