పూడిమడక తీరంలో విద్యార్థుల గల్లంతు ఘటన.. మరో రెండు మృతదేహాలు వెలికితీత
- బీచ్‌లో గల్లంతైన అనకాపల్లి డైట్ కాలేజీ విద్యార్థులు
- సముద్రంలో తేలుతున్న రెండు మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చిన వైనం
- మిగతా ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు
సమాచారం అందుకున్న వెంటనే రెండు నేవీ హెలికాప్టర్లు, నాలుగు బోట్లతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీటిపై తేలుతున్న రెండు మృతదేహాలను ఈ ఉదయం గుర్తించి హెలికాప్టర్ ద్వారా వాటిని ఒడ్డుకు చేర్చారు. వీరిని గోపాలపట్నం, తూచికొండకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన మిగతా ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.