అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్ గేమ్స్.. ఈ రోజు భారత్ పోటీ పడే క్రీడలు ఇవే
- నిన్న రాత్రి ఘనంగా ప్రారంభోత్సవం
- వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించిన సింధు, మన్ ప్రీత్ సింగ్
- నేడు క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ తదితర పోటీల్లో బరిలో భారత్
* బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 నుంచి జరుగుతుంది
* మహిళల టి20 క్రికెట్లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ బలమైన ఆస్ట్రేలియాతో తలడపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30కు మొదలవుతుంది.
* పురుషుల బాక్సింగ్ తొలి రౌండ్ లో శివ థాపా పాకిస్థాన్ కు చెందిన సులేమాన్ తో పోటీపడతాడు. ఈ బౌట్ సాయంత్రం 4:30 నుంచి జరుగుతుంది.
* మహిళల హాకీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఘనాతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30కు మొదలవుతుంది.
* టేబుల్ టెన్నిస్ టీమ్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా మహిళల జట్టు దక్షిణాఫ్రికా, ఫిజీతో తలపడనుంది. (మధ్యాహ్నం గం. 2 నుంచి);
* పురుషుల జట్టు బార్బడోస్, సింగపూర్ జట్లను ఎదుర్కొంటుంది. సాయంత్రం 4:30 నుంచి ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
* భారత క్రీడాకారులు పోటీ పడే ఈవెంట్లు సోనీ నెట్ వర్క్ తో పాటు సోనీలివ్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.