ఎన్టీఆర్ చేతుల మీదుగా 'బింబిసార' ట్రైలర్ లాంచ్!
- 'బింబిసార'గా కల్యాణ్ రామ్
- సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్
- కథానాయికలుగా కేథరిన్ - సంయుక్త
- ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వెలువడింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. అటు బింబిసారుడి తీరు .. ఇటు అదే పోలికలతో ఉన్న యువకుడిని ఆయన ఆవహించిన తీరును ఈ ట్రైలర్ లో చూపించారు. సుదీర్ఘమైన డైలాగ్స్ వలన .. డైలాగ్స్ లో డెప్త్ తగ్గినట్టుగా అనిపిస్తుంది.
'బింబిసార' మేనరిజంగా 'జగజ్జజ్జరిక' వినిపిస్తోంది. మొత్తానికి కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ సాహసమే చేశాడనిపిస్తోంది. కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాకి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. చిరంతన్ భట్ బాణీలను సమకూర్చాడు.