'సార్' నుంచి ధనుష్ ఫస్టులుక్ రిలీజ్!
- ధనుష్ హీరోగా రూపొందిన 'సార్'
- కథానాయికగా సంయుక్త మీనన్
- సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
- రేపు సాయంత్రం టీజర్ రిలీజ్
తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ధనుష్ కాస్తంత కండపట్టి మరింత యంగ్ లుక్ తో కనిపిస్తుండటం విశేషం. మొత్తానికి ఫస్టులుక్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడని చెప్పాలి. సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ధనుష్ జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రీలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్ మార్కెట్ ను మరింత పెంచుకుంటాడేమో చూడాలి.