TRS: తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

  • పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఆవరణలో నిరసన
  • ప్రధాని మోదీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
  • రాజ్యసభలో ఈ వారాంతం వరకు 19 మంది ఎంపీల సస్పెన్షన్
  • ఇందులో ముగ్గురు టీఆర్ ఎస్ ఎంపీలు
TRS MPs protesting over suspension in parliament

జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసనలు తెలిపిన వారిపై పడిన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేయడం అన్యాయం అన్నారు. 

రాజ్యసభలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారంటూ మంగళవారం 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వీళ్లపై సస్పెన్షన్ ఈ వారాంతం వరకు కొనసాగనుంది. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.

More Telugu News